మండలంలోని పట్టణాలు
- పలాస-కాశీబుగ్గ
పలాస-కాశీబుగ్గ పట్టణము (మున్సిపాలిటీ)
ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామము. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్న వాతావరణము నెలకొని ఉంటుంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని 1996 నవంబరు 22 న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21 వార్డులుండేవి. ఇప్పుడు 25 వార్డులు అయ్యాయి.
- ప్రధాన పరిశ్రమ: జీడి పరిశ్రమ సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తోంది.
- జనాభా: 59,899 (2001 జనగణన ప్రకారం 49,899)
- వార్డులు: 25
- పోలింగు బూతులు: 38
- వోటర్లు: 33,277
- పురుషులు: 16229
- స్రీలు: 17.048 .
మొత్తము వార్డులు | కాంగ్రెస్ గెలిసినవి | తెదేపా గెలిచినవి | స్వతంత్రులు |
25 | 14 | 7 | 4 |
ఛైర్మన్ పదవి కాంగ్రెస్ కే వచ్చింది. అధ్యక్షపదవి - స్త్రీ జనరల్ కేటగిరీ అయినందున "కోట్నిలక్ష్మి" చైర్పర్సన్ అయ్యారు.
సంవత్సరము | అధ్యక్షులు | పార్టీ | కేటగిరీ | ఉపాధ్యక్షులు | పార్టీ | కేటగిరీ |
2002 | వజ్జబాబూరావు | కాంగ్రెస్ | బూరకాళింగ (బి.సి) | కోట్నిదుర్గాప్రసద్ | కాంగ్రెస్ | వైశ్య (ఎఫ్.సి) |
2007 | కోట్నిలక్ష్మి | కాంగ్రెస్ | వైశ్య (ఎఫ్.సి) | నాగరాణి పాత్రో | కాంగ్రెస్ | పొందర (బి.సి) |
2014 ఎన్నికలు[మార్చు]
- మొత్తం ఓటర్లు : 40,048
- పోలయిన ఓట్లు : 30,208
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు 2014 పలాస తెలుగుదేశం 15879 15 2014 పలాస కాంగ్రెస్ 450 0 2014 పలాస వై.కా.పార్టీ 12978 8
డేకురు కొండ యాత్ర[మార్చు]
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపములోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయము, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.
No comments:
Post a Comment