Sunday, May 29, 2011

కొలను లోని కలువవై
నా కలలోని కన్నేవై
సయం సంధ్య సమయమున
అరుణ కిరననివై
నా మనసైన మగువ.!

ఉషోధయన వికసించిన కుసుమమా
నా మదిలో విరభుసిన మధురిమ
మదిలో విరభుసిన కుసుమమా
మల్లెల వానల్లో మధురిమా
నా మనసు నిత్య వసంతలడినది
నిరంతరం నిన్నే కోరినది రావే నన్ను చేరుకోవే .


కలువ లాంటి కన్నులు కలిగిన కలువ
నీ కలయిక కోసం నా కనులు కాయలు కాచే
చిరునవ్వులు చిలికే నీ చిరు మధు హాసం
నా మదిలో మరో వసంతం.

ప్రియతమ !
పువ్వులు రువ్వే నీ చిరునవ్వు
అందమైన చంద్రుని తో
తరిగి పాయినా కళ నీతో నా జీవితం
మధ్రమైన మరపురాని కళ
సఖియా నీ మాట



Friday, May 27, 2011

నా చెలి .....!

శ్రుతి మెత్తని ఉసులెన్నో చెప్ప లేకుండా వున్నాను,
వెన్నంటి మాటలను నా గుండెల్లో దాచాను,
మదిలోని మాటలను కవితలు మాలగా చేశాను,
మాలలను ముత్యాల హారముల నీ మేడలో వెయ్యాలనే నా తపన నా చెలి .!






" మక్కువైనది, మనసైనది, వెన్నంటిది,
మధురాతి మధురమైనది నీ ఉహల లోకం చెలి ... నా నిచ్చెలి.!
క్షణాన నా మనసు నీ వసమైందో గాని
క్షణం నుండి నేను నేనుగా లేను
నీ కోసం చూసే ఎదురు చూపుల్లో ఏదో ఆనందం
నీ కళ్ళలో కనపడే కోపం లో ఏదో భయం
నువ్వు లాలనగా మాట్లాడేటప్పుడు నీ కళ్ళలో ఏదో అనుభంధం
ఇవన్నీ ఏమోగాని నీ ఉహ నీ తపన నీ ద్యాస
నా మదిలో ఆనందపు సుడులను రేపుతున్నది నా నెరజాన.!


నేస్తమా నీ జీవితం పరిమళం
ప్రియతమ నా జీవితం నీకంకితం


చిరు గాలిలా.....!
చిరునవ్వులా .....!
మన మనసులా ..!

మదిలోని మాధుర్యం
జీవితంలోని సంతోషం
పల్లవిల పాడే పదజాలం
గానం తో పిలిచే పిలుపు

అవలీలగా సాగే సాగే కబుర్లు
అతిసులువుగా విత్చుకునే పెదవులు
పరోక్షంగా గుర్తుకు వచ్టే జ్ఞాపకాలు
సంతోషంగా విచారాలను పంచుకోవాలన్న తపన ....


మనసు పొరలు విప్పుకుని
గుండెలకు గుండెను చేర్చి హృదయరగాలను మేళవించి
ప్రాణాలకు ప్రాణం పెనవేసుకుని
ప్రపంచమే తము తామే ప్రపంచంగా ఉండటమే - అనుభంధం


నేస్తమా ... మన సంగమం రాలే నక్షత్రం
ఈ భువిలోని పంచ భూతాలు మనకు వరాలు
కానీ నీలోని స్వరాలూ
నాకు సరోవర విహారాలు .

నేస్తమా ! మన స్నేహం అద్భుతం
మన కలయిక అమోగం
నీ దరహాసం కోసం
వేచి ఉంటాను వెయ్యేళ్ళు.



ఆనంద సమయమున నిను నేను తలచితిని
నా మది ఆనంద పరవశం తో ఉప్పొంగిపాయింది ఎందువల్లో
నీ మీద నాకు వున్నా ప్రేమ.



వర్షపు జల్లునకు గుండెలో
పుట్టెను ప్రేమ పరవళ్ళు.

వసంతమున కోకిల పాడును కానీ
నా గుండె ఎల్లప్పుడు నీ పేరును స్మరించును .




God